వరంగల్ : యూనివర్సిటీ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహిస్తాంమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం వర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ..విశ్వవిద్యాలయానికి సంబంధించి పరిపాలన వ్యవహారాలను వరంగల్ నుంచే కొనసాగిస్తామన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా, పొరపాటులకు రావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వైద్య కళాశాలలో ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాగింగ్ చేసినట్లు రుజువు అయితే కళాశాల నుంచి అడ్మిషన్ సైతం తొలగిస్తామన్నారుఎ. వైద్య విద్యార్థులకు డ్రగ్స్‌కు బానిసలు కావద్దు
అని సూచించారు. కళాశాలలో ర్యాగింగ్, డ్రగ్స్ వ్యవహారాలు కొనసాగింట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.