హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బ రాజ్‌ల పునరుద్ధరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రా మచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ ఆలస్యం కావడంతో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ సిఫార్సులను సకాలంలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 2024, 2025, 2026లో మూడు పూర్తి వర్కింగ్ సీజన్లు ఉన్నా పునరుద్ధరణ పనులు పూర్తిచేయలేదని మండిపడ్డారు. 200 టీఎంసీల గోదావరి నీటిని తెలంగాణ వినియోగించుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ ఇప్పటికే సమగ్ర పరీక్షలు, సాంకేతిక పరిశీలనలు, పునరుద్ధరణ చర్యలు సూచించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సాంకేతిక మార్గదర్శకత్వానికేనని, అమలు బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. ఎన్డీఎస్ఏ కమిటీపై నెపం నెట్టడం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి తన బాధ్యతల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు తక్కువ నష్టం జరిగిందని, వాటిని ముందే పునరుద్ధరిస్తే ఉత్తర తెలంగాణకు నీరు ఉండేదని వ్యాఖ్యానించారు. 20 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణకు తాగునీరు అందించే అవకాశం కోల్పోయిందని పేర్కొన్నారు. విజిలెన్స్ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ నివేదికలో సూచించిన వారిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక విషయంలో ప్రభు త్వం హైకోర్టులో సమర్థంగా వాదించలేదని, బీ ఆర్ఎస్ పెద్దలను కాపాడేందుకే కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. సీబీ ఐ విచారణకు కేవలం మూడు బరాజ్‌ల అంశానికే పరిమితమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని, పంప్‌హౌస్‌లు, కాలువలు, టన్నెళ్లు, రిజర్వాయర్లు సహా మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరుగాలని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను అడ్డుపెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను త ప్పుదోవ పట్టిస్తున్నారని, మేడిగడ్డలో నీటిని ని ల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయవచ్చని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా రాజకీయాలు పక్కనపెట్టి, మే డిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను పునరుద్ధరించి, ప్రజల కోసం కాళేశ్వరం నీటిని వినియోగంలోకి తీసుకొనిరావాలని డిమాండ్ చేశారు.