రైతుల గోడు పట్టని రేవంత్ సరార్
రాష్ట్రంలో సాగునీరు అందక పంట పొలాలు నెర్రలు బారుతుంటే, రోజుకు 2 నుంచి 3 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తూ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ధ్వజం
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సాగునీరు అందక పంట పొలాలు నెర్రలు బారుతుంటే, రోజుకు 2 నుంచి 3 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తూ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. గురువారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డికి పాలనపై సరైన ప్రణాళికలు, స్పష్టత లేదని, అన్నదాతలు, విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశ రక్షణరంగానికి ఎనలేని సేవలందించి, ప్రపంచపటంలో సమున్నతంగా నిలిపిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాంను కాంగ్రెస్ నాయకత్వం గతంలో బాంబ్మెన్ అంటూ అవమానించిందని రాం చందర్రావు ఆరోపించారు. కాంగ్రెస్కు ప్రజ లే తగిన గుణపాఠం చెప్తారని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

