హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ) : తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎప్పుడూ మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమర్థించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గు రువారం మీట్ ది ప్రెస్‌లో ఆయన మా ట్లాడారు. పవన్‌కల్యాణ్ సభకు అనుమతిస్తే సరిపోయేదని, మరి ఎందుకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వమే చె ప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో మళ్లీ ప్రజలను రె చ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయ ని ఆరోపించారు. సమావేశం పెట్టుకోవ డం ప్రతి ఒక్కరి ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇ స్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏ మైంది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాల యాన్ని చూసిన రెగ్యులర్ ప్రొఫెసర్లు లేరని, అంతా పార్ట్‌టైమ్ ఉద్యోగులతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. కొరటకుంట ప్రాజెక్టు కోసం కర్ణాటకతో తె లంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్నదని, రాష్ర్టానికి రావాల్సిన కృష్ణా జలాలను కర్ణాటక కొత్త సీఎం డీకే శివకుమార్‌కు రేవంత్‌రెడ్డి గిఫ్ట్‌గా ఇచ్చారని ఆరోపించారు. డీకే, రాహుల్ మెప్పు కోసమే రేవంత్ ఈ ఒప్పందం కుదుర్చుకొన్నారన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు ఉన్నారని, సీజేపీకి జార్జ్ సోరొస్ ఫండింగ్ చేస్తున్నారని ఆరోపించారు.