ములుగు రూరల్, జూలై 7 : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి అనుబంధంగా ఉన్న శివాలయానికి జాతీయ గుర్తింపు లభించింది.
కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు శివాలయానికి జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తింపు లభించినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయాన్ని జాతీయ సంపదగా ప్రకటించడంతో అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి.