హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దక్షిణాఫ్రికా దేశమైన మాలిలో తెలంగాణ బిడ్డ నవీన్ కిడ్నాప్ అయిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని.. తిరుగుబాటుదారుల చేతుల్లో బందీగా ఉన్న నవీన్‌ను రాష్ర్టానికి రప్పించే సోయి ప్రభుత్వానికి లేదని మానవహక్కుల ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నవీన్‌ను వెంటనే స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను రాష్ట్ర మానవహక్కుల కమిషన్ నమోదు చేసుకొని.. విచారణకు స్వీకరించింది.