హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమల కొండ పవిత్రతను కాపాడాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ కోరారు. ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కొందరు కొండపైనే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ, రాజకీయంగా విమర్శలు చేసుకోవడం తగదని హితవు పలికారు.
రాజకీయాలు చేసే వారిని నిరోధించేందుకు టీటీడీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తిభావం తొణికిసలాడాల్సిన చోటును రాజకీయాలకు వేదికగా చేసుకోవడం భావ్యం కాదని పేర్కొన్నారు. కొండపై రాజకీయాలు చేయకుండాకఠిన నిబంధనలు రూపొందించాలని ఏపీ సీఎం జగన్, టీటీడీ చైర్మన్‌ను ఆయన కోరారు.