హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రిజ్వీ ఎందుకు వీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చిందో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రుల ఒత్తిడికి లొంగని వాళ్లను బలి చేస్తారా? అని ప్రశ్నించారు. అధికారి తప్పు చేసి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రభుత్వాన్ని, మంత్రులను ఆయన నిలదీశారు.