హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం వర్తింపజేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంలో మాట్లాడారు. రాజీవ్ యువవికాసం పథకం మంజూరు పత్రాలను జూన్ 2న అందజేస్తామని, బ్యాంకర్లు సహకరించాలని ఆయన కోరారు.
అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రస్థాయి నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. 5 లక్షల మంది యువతకు రూ. 9వేల కోట్లు సాయం చేసే పథకం దేశచరిత్రలో తొలిసారి అమలు చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్సీ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీలు శరత్, శ్రీధర్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, నాబార్డ్ సీజీఎం ఉదయ్భాసర్, ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్‌కుమార్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ ప్రకాశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.