క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ (సీఎంఎఫ్సీ) చైర్మన్‌గా రాజేశ్వర్‌రావు బాధ్యతలను స్వీకరించారు. గురువారం నాంపల్లి గృహకల్ప బిల్డింగ్‌లోని కార్పొరేషన్ కార్యాలయంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా బిషప్‌లతో కలిసి రాజేశ్వర్‌రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకకు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. రాజేశ్వర్‌రావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
– హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)