e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home తెలంగాణ డ్రిప్‌లో చేరికపై త్వరలో నిర్ణయం

డ్రిప్‌లో చేరికపై త్వరలో నిర్ణయం

  • సీఎం కేసీఆర్‌తో చర్చించాకే వెల్లడి
  • సీడబ్ల్యూసీ ఇంజినీర్లతో రజత్‌కుమార్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (నమస్తే తెలంగాణ): డ్యాం రెన్నొవేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (డ్రిప్‌) పథకంలో చేరే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించాక నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఇరిగేషన్‌శాఖ స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ రజత్‌కుమార్‌ సీడబ్ల్యూసీ ఇంజినీర్ల బృందానికి వెల్లడించారు. ఆర్ధిక అంశాలతో ముడిపడిఉన్న ఈ అంశం పై సీఎం కేసీఆర్‌తో చర్చించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. మంగళవారం సీడబ్ల్యూసీ చీఫ్‌ ఇంజినీర్‌ గుల్షన్‌రాయ్‌, డ్రిప్‌ డైరెక్టర్‌, డిప్యూటీడైరెక్టర్‌ రామ్‌కుమార్‌ శుక్లా, కాండియాల్‌ నేతృత్వంలోని బృందంతో జలసౌధలో రజత్‌కుమార్‌ భేటీ అయ్యా రు. డ్రిప్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 736 డ్యామ్‌లను పునరుద్ధరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకో గా, ఇందుకోసం రూ.10,211 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. ఇందులో రాష్ట్రంలో 29 ప్రధా న డ్యామ్‌ల పునరుద్ధరణకు రూ.644.50 కోట్లు ఖర్చవుతుందని లెకలు వేసింది. రాష్ట్రం నుంచి పాకాల, లక్నవరం, రామప్ప సరస్సులు, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, పోచారం, పాలేరు రిజర్వాయర్‌, నిజాంసాగర్‌, డిండి, కోయిల్‌సాగర్‌, కడెం, మూసీ, నాగార్జునసాగర్‌, ఎస్సారెస్పీ, స్వర్ణ, ఎల్‌ఎండీ, మల్లూరువాగు, బొగ్గులవాగు, ఎన్టీఆర్‌ సాగర్‌, జూరాల, కౌలాస్‌ నలా, సాత్నాలా, సింగూ రు, ఎల్లంపల్లి, వట్టివాగు, గడ్డెన్నవాగు, అకంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌, పీపీరావు ప్రాజెక్టులున్నాయి. డ్రిప్‌లో భాగంగా రాష్ట్రం నుంచి జూరాల ప్రాజెక్టుకు అత్యధికంగా రూ.143.44 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నదని గుర్తించారు. నాగార్జునసాగర్‌కు రూ.29.56 కోట్లు, ఎస్సారెస్పీకి రూ.63.48 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. ఈ డ్యామ్‌ల ఆధునీకరణ, మరమ్మతుల కోసం డ్రిప్‌ పథకంలో చేరితే కేం ద్రం వరల్డ్‌బ్యాంకు నిధులనుంచి 70శాతం రుణంగా ఇవ్వనుండగా.. మరో 30శాతం రాష్ట్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana