హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. పేపర్ లీకు వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ సోషల్ మీడియా వారియర్ అని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని విమర్శించారు. దీనికి బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాబా ఫసియుద్దీన్‌తో కలిసి దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ టీఎస్పీఎస్సీ అని తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా టీఎస్పీఎస్సీ 130 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఇచ్చి వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఇప్పటి వరకు ఆ సంస్థపై చిన్న మరక కూడా పడలేదని వివరించారు. తాజాగా పేపర్ లీకు వ్యవహారం బయటికి రావడం దురదృష్టకమని అన్నారు.
ఈ లీకు వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని ఆరోపించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డి బీజేపీ సోషల్ మీడియాలో చురుకైన వారియర్ అని తెలిపారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ‘బీజేపీకి ఓటెయ్యాలి, కిషన్‌రెడ్డికి ఓటెయ్యాలి’ అని రాజశేఖర్‌రెడ్డి పెట్టిన పోస్టింగ్ క్లిప్పులను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కండువా ధరించి కరపత్రాలు పంచిన దృశ్యాలను ప్రదర్శించారు. వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే ‘ఒకేసారి ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తుంటే మాకు కార్యకర్తలు దొరకటం లేదు’ అని బండి సంజయ్ బహిరంగంగా వాపోయిన ఉదంతాలను ఈ సందర్భంగా ఉదహరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌కు కుట్ర చేసిందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పేపర్ లీకులను ఆయన ఉదహరించారు.
Rajashekar
బీజేపీ కుట్రలను ఎండగడతాం: ఎర్రోళ్ల
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల ఆదరణ, సీఎం కేసీఆర్‌పై ఉద్యోగార్థుల్లో ఉన్న అభిమానాన్ని చూసి ఓర్వలేక బీజేపీ పన్నిన కుట్రలో భాగమే పేపర్ లీక్ అ ని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహ పలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే పేపర్ లీకులయ్యాయని గుర్తుచేశారు. ఒక్క గుజరాత్‌లోనే 8 ఏండ్లలో 13 పేపర్లు లీక్ అయ్యాయని తెలిపారు.
Shekar Bjp