సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్, నవంబర్ 8 : సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్కు రోజురోజుకు మద్దతు వెల్లువెత్తున్నది. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన కేటీఆర్కే మరోసారి పట్టంకడుతామం టూ అన్నివర్గాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు.
బుధవారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రజకులు సం పూర్ణ మద్దతు ప్రకటించారు. తంగళ్లపల్లి మండలం రామన్నపల్లెలోని కేసీఆర్నగర్ వాసులు (డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం) మంత్రి కేటీఆర్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. తమకు గూడునిచ్చిన కేటీఆర్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. కారు గుర్తుకే ఓటేస్తామని వారు స్పష్టం చేశారు.