Revanth Reddy | రాష్ట్ర కాంగ్రెస్‌లో(Congress) అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరినట్లే కనిపిస్తున్నాయి. అధికారులపై పట్టులేక, పాలన చేతకాక, పార్టీ నాయకులను అదుపు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా మంత్రి వర్గ విస్తరణ(Cabinet expansion) రేవంత్ రెడ్డికి సవాల్‌గా మారి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పలువురు నాయకులు సీఎంను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది.
ఢిల్లీలో బల ప్రదర్శన.. బేజారైన సీఎం
మరీ ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ బ్లాక్ మెయిల్‌ను రాజకీయాలు ముమ్మరం చేసినట్లు ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మొన్న జరిగిన సీఎం నల్లగొండ సభకు రాజగో పాల్ రెడ్డి డుమ్మా కొట్టి మరీ మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అనుచరులతో కలిసి ఢిల్లీలో బలప్రదర్శన చేసినట్లు తెలిసింది. ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసి రాజగోపాల్ మద్దతు సంపా దించుకోవడంతో షాక్ తినడం రేవంత్ వంతయింది. రాజగోపాల్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గితే.. మిగతా ఆశావహులు కూడా బ్లాక్‌మెయిల్‌కు దిగే ఛాన్స్ ఉందనే టెన్షన్లో సీఎం ఉన్నారు.
రాజగోపాల్‌కి మంత్రి పదవి ఇస్తే తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం బెదిరింపులకు పాల్పడటంతో రేవంత్ రెడ్డికి అదనపు తలొనొప్పిగా మారింది. ఇదే అదునుగా రకరకాల కోటాలలో మంత్రి పదవులు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
రేవంత్‌కి చెప్పకుండానే..
వీరిలో ప్రధానంగా మున్నూరు కాపు కోటాలో ఆది శ్రీనివాస్, లంబాడా కోటాలో రాములు నాయక్, బాలు నాయక్ ఉన్నారు. ఇప్పటికే లంబాడాలకు మంత్రి పదవి ఇవ్వాలని లంబాడా నేతలు గాంధీ భవన్ని ముట్టడించి ఒత్తిడి పెంచారు. అలాగే బీసీ కోటాలో డిప్యూటీ సీఎం లేదా మంత్రి పదవి కావాలని టీపీసీసీ మహేశ్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం రేవంత్‌కి చెప్పకుండా ఢిల్లీలో రాహుల్‌ని కలిసి మంత్రి పదవి కోసం పైరవీలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
దీంతో ఏం చేయాలో పాలుపోక రేవంత్ రెడ్డి తలపట్టుకుంటున్నారు. తన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడని తెలిసింది. మంత్రి వర్గ విస్తరణ అంటేనే సీఎం జంకుతున్నారని, ఎక్కడ తన సీటుకు ఎసరు తీసుకొస్తుందోనని తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడు తున్నారని ఆ పార్టీ సీనియర్ నేతలే చర్చించుకోవడం కొసమెరుపు.
రాజగోపాల్ బ్లాక్మెయిల్.. ఒత్తిడిలో రేవంత్
నల్గొండ సభకు డుమ్మా.. మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అనుచరులతో బలప్రదర్శన
రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసి మద్దతు తెచ్చుకున్న రాజగోపాల్.. రేవంత్ ఉక్కిరిబిక్కిరి
రాజగోపాల్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గితే.. మిగతా ఆశావహులు కూడా బ్లాక్‌మెయిల్‌కు… https://t.co/WGHmFO9gQ5 pic.twitter.com/kBJtViBnf0
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2026