MLA Rajasingh | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీజేపీలో రాక్షలున్నారని, ఆ పార్టీలో చేరవద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే టికెట్ వస్తుందన్న గ్యారెంటీ లేదని, ఒకవేళ చేరితే కుట్రలు, కుతంత్రాలు తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు.
బీజేపీలో చేరిక రోజు ఫస్ట్ సీటులో ఉన్నవారు తర్వాత చివరి సీటుకు పరిమితమవుతారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.