హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఎనర్జీ ఎఫిషియన్సీ మాడల్ క్యాంపస్‌గా రాజ్‌భవన్‌ను తీర్చిదిద్దాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధికారులకు సూచించారు. రాజ్‌భవన్‌తోపాటు జేఎన్టీయూ క్యాంపస్‌ను సైతం మాడల్ క్యాంపస్‌గా మార్చాలని ఆదేశించారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ద్వారా ఈ రెండింటిలో ఇంధన ఆడిట్‌ను నిర్వహించాలని పేర్కొన్నారు.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) దక్షిణ భారత ప్రాంతీయ మీడియా సలహాదారు ఏ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈఎస్ఎల్ సీనియర్ అధికారులు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి ఇంధన సామర్థ్య రంగంలో కీలక పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భూ తాపాన్ని తగ్గించేందుకు త్రిముఖ వ్యూహాంతో ముందుకు సాగాలని సూచించారు. గ్రీన్‌హౌజ్ వాయువులు, ఉద్ఘారాలను తగ్గించేందుకు ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా కృషిచేయాలని పేర్కొన్నారు