Telangana | హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ దక్షిణ ఒడిశా పరిసరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.
24వ తేదీన ఒక అల్పపీడనం దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.