Rains | హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్( Warangal), నల్లగొండ( Nallagonda ), ఖమ్మం జిల్లా( Khammam Dist )ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ( Weather dept ) తెలిపింది. ఈ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్( Yellow Alert ) జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.