హైదరాబాద్: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నే య దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది. 24 గంటల్లో పొడివాతావరణం ఏర్పడిందని వెల్లడించింది. కేవలం168 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.