హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు కురిసే అవకాశముందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో అకడకడ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.