హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొన్నది. అలాగే క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మ ల్, మంచిర్యాల, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న ట్టు ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షా లు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.