Rain | నాగర్కర్నూల్, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో గాలివాన బీభత్సం..
Rain | ఇవాళ (శనివారం) తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలితో కూడిన వర్షం అల్లకల్లోలం సృష్టించింది. గాలివాన బీభత్సం కారణంగా ఏపీలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Rain : ఇవాళ (శనివారం) తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలితో కూడిన వర్షం అల్లకల్లోలం సృష్టించింది. గాలివాన బీభత్సం కారణంగా ఏపీలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం గోవిందాయిపల్లిలో పిడుగుపాటుకు ఒక గొర్రెల కాపరి మృతిచెందాడు. అచ్చంపేటలో భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయింది.
ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దాదాపు అరగంటపాటు గాలి, వాన రావడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రమణయ్యపేట, ముకుందరాజుపేట, దోసలపాడు, చీడిక, జి.జగన్నాథపురం, గొడిచర్ల, డొంకాడ, చినదొడ్డిగల్లు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. సత్యవరం గ్రామంలో కొబ్బరిచెట్లు నేలకూలి తమలపాకులు సేకరించే ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ముకుందరాజుపేటలో ఇంటి రేకులు పడి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.
గాలుల ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మామిడి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో భారీ ఈదురుగాలులకు తలుపులమ్మ తల్లి ఆలయ మార్గంలో కారుపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆ ఉత్తర్వులు బీజేపీ కార్యకర్తలకు రోజ్గార్ గ్యారెంటీ’
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

