HYD Rains | హైదరాబాద్ నగర పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఎస్ఆర్నగర్, బోరబండ, అమీర్‌పేట, పంజాగుట్ట, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానపడుతున్నది. మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, కార్వాన్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్పల్లితో పాటు కుత్బుల్లాపూర్ పరిసరాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. గుండ్లపోచంపల్లి, దుండిగల్, దూలపల్లి, బహదూర్‌పల్లి, మియాపూర్, నానక్‌రామ్‌గూడలో వానపడుతున్నది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చైతన్యపురి, దిల్‌షుఖ్‌నగర్, మియాపూర్, గచ్చిబౌలి, వనస్థలీపురం తదితర ప్రాంతాల్లో వానకురుస్తుంది. గాంధీ భవన్ ప్రాంతంలో భారీ చెట్టు నేలకూలింది. చంపాపేట, సైదాబాద్, సరూర్‌నగర్‌తో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతున్నది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరో వైపు వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాబోయే గంటలో హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.