ఇల్లెందు రూరల్/ కారేపల్లి/ చుంచుపల్లి/ములకలపల్లి/చండ్రుగొండ, మే 19 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కురిసిన వర్షం తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఇల్లెందు మండలం కట్టుగూడెంలో పీ పుల్లయ్య (45) పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ భీకర శబ్దానికి.. పక్కనే ఉన్న అతడి సోదరుడు వెంకన్న సొమ్మసిల్లి పడిపోయాడు.
కారేపల్లి మండలం పాటిమీదిగుంపు సమీపంలో పిడుగుపాటుకు 20 మూగజీవాలు మృత్యువాతపడగా లక్ష్మ య్య అనేవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చండ్రుగొండ మండలం గానుగపాడులో విద్యుత్తు తీగ తెగి పడటంతో షాక్కొట్టి మూడు పశువు లు మృత్యువాతపడ్డాయి. చుంచుపల్లి, ములకలపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ ధాన్యం తడిసింది.