హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ మా ర్పులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.