కాజీపేట, జూన్ 21: కాజీపేట రైల్వే జంక్షన్ శివారు అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చే డిసెంబర్లో ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వేజోన్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ పేర్కొన్నారు. శనివారం ఆయన కాజీపేట రైల్వేజంక్షన్ పరిసరాల్లో నిర్మించిన రన్నింగ్ రూమ్‌ను సికింద్రాబాద్ రైల్వే డీఆర్ఎం భర్తేశ్కుమార్జైన్తో కలిసి ప్రారంభించారు.
సికింద్రాబాద్ నుంచి రైల్వే ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక రైలులో తనిఖీలు చేసుకుంటూ కాజీపేట రైల్వే జంక్షన్‌కు చేరుకున్నారు. ఆర్ఆర్ఐ క్యాబిన్, క్రూల్యాబీ, పవర్ కంట్రోల్‌రూం, అమృత్ భారత్ పథకం పనులను తనిఖీచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోకో రన్నింగ్ స్టాఫ్ కార్మికుల కోసం రన్నింగ్ రూమ్ నిర్మించినట్టు తెలిపారు. రైల్వే కోచ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, భవిష్యత్‌లో వందేభారత్ కోచ్‌లు తయారవడం ఖాయమని చెప్పారు.