Secunderabad-Goa Train | గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. సికింద్రాబాద్ – వాస్కోడిగామా – సికింద్రాబాద్ మధ్య కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 6న రైలును ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్ – వాస్కోడగామా (07039) వన్ వే స్పెషల్ రైలును ఉదయం 11.45 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెల 9 నుంచి రెగ్యులర్ సేవలు మొదలవుతున్నాయని పేర్కొంది.
సికింద్రాబాద్ – వాస్కోడిగామా (17039) రైలు ప్రతి బుధవారం, శుక్రవారాలు అందుబాటులో ఉంటుందని.. వాస్కోడిగామా – సికింద్రాబాద్ (17040) రైలు గురువారం, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉదయం 10.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.45 గంటలకు వాస్కోడిగామాకు చేరుకుంటుందని పేర్కొంది. రైలు కాచిగూడ, షాదర్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, గదడ్, హుబ్బలి, దర్వాడ్, లోండా, మడగాన్ మీదుగా వాస్కోడిమాకు చేరుకుంటుందని వివరించింది. రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పింది.
“Introduction of Secunderabad – Vasco-Da-Gama-Secunderabad Bi-Weekly Express” @RailMinIndia @drmsecunderabad @drmgtl pic.twitter.com/18L47fow6L
— South Central Railway (@SCRailwayIndia) October 3, 2024