ఆత్మహత్యలకు హాట్‌స్పాట్‌గా మారిన సిర్పూర్(టీ) – పెద్దంపేట్ రైల్వే ట్రాక్
Suicides | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ) - పెద్దంపేట(పెద్దపల్లి జిల్లా) రైల్వే ట్రాక్ ఆత్మహత్యలకు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ట్రాక్‌పై 8 నెలల కాలంలోనే 102 మంది మరణించినట్లు మంచిర్యాల రైల్వే పోలీసులు

మంచిర్యాల : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ) – పెద్దంపేట(పెద్దపల్లి జిల్లా) రైల్వే ట్రాక్ ఆత్మహత్యలకు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ట్రాక్‌పై 8 నెలల కాలంలోనే 102 మంది మరణించినట్లు మంచిర్యాల రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు మొత్తం 102 మంది మృతి చెందగా, ఇందులో 61 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మృతుల్లో 93 మంది మృతదేహాలను గుర్తించారు. మరో 9 మందిని ఇప్పటికీ గుర్తించలేదు అని మంచిర్యాల స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ టీ సుధాకర్ తెలిపారు.
రైళ్లను ఢీకొని సుమారు 41 మంది వరకు మరణించారు. నెలకు 10 మంది చొప్పున మరణించినట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో అధికంగా 20 నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న వారేనని తెలిపారు. అయితే ఈ రైల్వే ట్రాక్.. పలు నివాస సముదాయాల కాలనీల గుండా వెళ్తోంది. మంచిర్యాల, రామకృష్ణాపురం, మందమర్రి, బెల్లంపల్లి, తాండూరు, రేచిని, కాగజ్‌నగర్ పట్టణాల మీదుగా వెళ్తోంది. వివిధ కారణాలతో మనస్తాపానికి గురయ్యే వ్యక్తులు.. క్షణికావేశంలో దగ్గర్లో ఉన్న ట్రాక్‌పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

