తుపాకీతో హల్చల్.. యువకుడు అరెస్ట్
తుపాకీతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఓ యువకుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు.. సరూర్‌నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం కథనం ప్రకారం .. సరూర్‌నగర్ శంకర్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు (22) సరూర్‌నగర్ భగత్‌సింగ్‌నగర్‌లోని బస్తీ దవాఖాన వెనుక ప్రాంతంలో ఓ కంట్రీమేడ్ రివాల్వర్‌తో పాటుగా ఓ లైవ్ రౌండ్‌తో స్థానికులను బెదిరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నాడు.
ఎల్బీనగర్, జూలై 27 : తుపాకీతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఓ యువకుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు.. సరూర్‌నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం కథనం ప్రకారం .. సరూర్‌నగర్ శంకర్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు (22) సరూర్‌నగర్ భగత్‌సింగ్‌నగర్‌లోని బస్తీ దవాఖాన వెనుక ప్రాంతంలో ఓ కంట్రీమేడ్ రివాల్వర్‌తో పాటుగా ఓ లైవ్ రౌండ్‌తో స్థానికులను బెదిరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులతో కలిసి మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
చెడు సవాసాలకు అలవాటుపడిన ఇమ్రాన్ .. చోరీలబాట పట్టాడు. గతంలో ఇతడిపై వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 17 కేసులు నమోదై ఉన్నాయి. గత ఏడాది రాజేంద్రనగర్‌లోని ఓ స్క్రాప్ షాపులో పనిచేసే సమయంలో బిహార్‌కు చెందిన షకీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అతడి ద్వారా రూ.40 వేలకు ఓ కంట్రీమేడ్ రివాల్వర్, ఓ రౌండ్ బుల్లెట్లను కొనుగోలు చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం భగత్‌సింగ్‌నగర్ ప్రాంతంలో తుపాకీతో హల్చల్ చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

