ఐదేండ్లలో రూ.450 కోట్లే విడుదల.. తొమ్మిది వెనుకబడిన జిల్లాల నిధుల విడుదలపై లోక్‌సభలో కేంద్రం స్పష్టత
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం గత ఐదేండ్లలో కేవలం రూ.450 కోట్లే విడుదల చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం గత ఐదేండ్లలో కేవలం రూ.450 కోట్లే విడుదల చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్లను(యూసీ) సమర్పించినప్పటికీ, గత ఐదేండ్లలో (2019-20 నుంచి 2023-24వరకు) వెనుకబడిన జిల్లాలకు అందించాల్సిన వార్షిక రూ.450 కోట్ల ప్రత్యేక ఆర్థికసాయాన్ని ఎందుకు విడుదల చేయలేదు?
ఈ నిధులను ఎప్పటిలోగా విడుదల చేసే అవకాశమున్నది? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 కింద ఇప్పటివరకు సంవత్సరాలవారీగా తెలంగాణకు మంజూరు చేసి, విడుదల చేసిన నిధుల సమగ్ర వివరాలేంటి? అని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం పైవిధంగా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఐదు విడతల్లో ఇప్పటికే రూ.2,250 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. 2021 మార్చి 31న చివరి విడతగా రూ.450 కోట్లు విడుదల చేసినట్టు తెలిపిన కేంద్ర మంత్రి..2022 నుంచి ఇప్పటివరకు ఎంత విడుదల చేశారో అనే విషయాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

