హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణాపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు సివిల్‌సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నెల రోజులుగా నిర్వహించి న దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న, నిల్వ ఉంచిన రూ.1.5 కోట్ల విలువైన 5,079 డొమెస్టిక్, 70 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీరిపై 2,089 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. గ్యాస్ సిలిండర్ల అ క్రమ నిల్వ, తరలింపు, డెలివరీలో జా ప్యంపై పౌరసరఫరాలశాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
సోమవారం ఆయిల్ కంపెనీలు, డీలర్లతో స్టీఫెన్ రవీంద్ర స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సుమారు 2.18 లక్షల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా అవుతున్నాయని కంపెనీలు తెలిపాయి. స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సిలిండర్లను సరఫరా చేయాలని, అక్రమ రవాణా, బ్లాక్‌లో విక్ర యం, అధిక ధర వసూలుపై చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు.