హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ జీ.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీ మాటలు నమ్మి తెలంగాణ యువత కాంగ్రెస్‌కు ఓటేశారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు సున్నా. ఎన్ని ఉద్యోగాలో చెప్పకుండా జాజ్లెస్ క్యాలెండర్ ఇచ్చారు. మరోసారి హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు వచ్చి యువతను కలిసి మీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో చెప్పండి?.. అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్‌కు వచ్చి యువతతో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.
కాగా, శుక్రవారం రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. పోస్టుల సంఖ్య లేకుండా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తొమ్మిది నెలల కిందట ఉద్యోగాల పేరిట ఎంత డ్రామా చేసిండ్రు..కేసీఆర్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టు తప్పుడు ప్రచారం చేసిండ్రు. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలని పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ సంపాదనతో కాంగ్రెస్ నాయకులు ప్రకటనలిచ్చిండ్రు. రాహుల్ గాంధీని అడుగుతున్న, నువ్వు ప్రామిస్ చేసిన రెండు లక్షల ఉద్యోగాలేవీ?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
Ktr 1
క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయని, మరి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఏవని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ వాళ్లు బయట కనబడితే నిరుద్యోగులు తన్నితరిమేసే పరిస్థితి ఉన్నదని దుయ్యబట్టారు. అందుకే నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చారని, అది జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారని ఆక్షేపించారు. జాబ్ క్యాలెండర్ నిజమైతే అందులో రెండు లక్షలు కాదు రెండు ఉద్యోగాలు కూడా ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్‌నగర్‌కు రావాలని, తామంతా అక్కడికి వస్తామని కేటీఆర్ వారికి సవాల్ విసిరారు.
Hello @RahulGandhi Ji,
The youth of Telangana had believed your words on “2 lakh govt jobs in 1 year” & voted for Congress
Now after 8 months, the youth is agitating as Zero jobs have been delivered & a “jobless” calendar issued
Why don’t you come back to Ashok Nagar,… https://t.co/LJbagV2Kka
— KTR (@KTRBRS) August 3, 2024