AIADMK : తమిళనాడు (Tamil Nadu) లో అధికార డీఎంకే (DMK) పై ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సీఎం స్టాలిన్ (CM Stalin) నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రూ.4 లక్షల కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి (Edappadi Palaniswami) తమిళనాడు గవర్నర్‌కు ఆధారాలు సమర్పించారు.
స్టాలిన్ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. సుపరిపాలన అందించడంలో స్టాలిన్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీఎంకే ప్రభుత్వం అవినీతి చేయడం తప్ప.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఒక్కపనీ చేయలేదన్నారు.
గడిచిన 56 నెలల్లో ప్రభుత్వం ఏటా లక్ష కోట్ల రూపాయల అప్పు చేసిందని పళనిస్వామి ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపలే రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందన్నారు. ఇవాళ ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని లోక్‌భవన్‌లో పళనిస్వామి గవర్నర్‌ను కలిశారు.