ఖలీల్‌వాడి, మే 16: కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతి అనకొండ లేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. మంత్రులకు లంచా లు ఇవ్వనిదే ఫైళ్లు ముందుకు కదలవని శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తా రు. సచివాలయమంతా అవినీతి కంపు కొడుతున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమీషన్ల పాలన అని, ఇది తాము అంటున్నది కాదని, ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులకు డబ్బు లు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ఆమె మాటలు కాంగ్రెస్ సర్కారు అంతులేని అవినీతికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డే పెద్ద అవినీతి భూతమని ఆరోపించారు. పీసీసీ అంటేనే ప్రదేశ్ కరెప్షన్ సెంటర్ అని, అది ఇండియన్ నేషనల్ క్రైమ్ అండ్ కరప్షన్ పార్టీ అని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియా అని దుయ్యబట్టారు. అవినీతి పాఠాల్లో కాంగ్రెస్‌కు ఫస్ట్ మార్క్ అని పేర్కొన్నారు.