‘ప్రధానమంత్రి మోదీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. పాలసీల పరంగా మాత్రమే నేను ఆయనను వ్యతిరేకిస్తాను’ అని శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు జవాబుగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
‘కాంగ్రెస్ పార్టీలో కొందరు బీజేపీ కోవర్టులున్నారు. వాళ్లంతా కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి వాళ్లు బయటకు వెళ్లి పనిచేయాలి. వాళ్లు 10, 20, 30 ఇలా ఎంతమంది ఉన్నా సరే వాళ్లందర్నీ పార్టీ నుంచి పంపిచేస్తా’
ఇవీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గుజరాత్‌లోని ఓ కార్యక్రమంలో శనివారం సొంత పార్టీ నేతలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు.
Congress Party | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఒకే రోజు తేడాతో సీఎం రేవంత్‌రెడ్డి.. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పడం, మరోవైపు కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులున్నారని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నది. రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు కేవలం గుజరాత్‌కే పరిమితమవుతాయా లేక తెలంగాణకు కూ డా వర్తిస్తాయా అంటూ పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.
ముఖ్యంగా రాహుల్ వ్యాఖ్యల ఉద్దేశం వెనుక రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ సీఎంగా ఉంటూ ప్రధానిని మూడుసార్లు కలిశారు. సొంత పార్టీ సీఎంలకు లభించని ప్రధాని అపాయింట్మెంట్ ప్రతిపక్ష సీఎం అయి న రేవంత్‌కు ఎలా లభిస్తుందనే సం దేహాలు కాంగ్రెస్‌లో వ్యక్తమయ్యా యి. వారంరోజుల క్రితం హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ మోదీతో భేటీ అయ్యారు. ఎప్పుడు పడితే అప్పుడు మోదీ అపాయింట్మెంట్ లభించడం, రేవంత్ అడిగిన పనులను ప్రధాని ఆమోదించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన పై మొదటినుంచి అనుమానాస్పదంగానే వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలున్నాయి. అనివార్య పరిస్థితు ల్లో సీఎం చేసిందే తప్ప.. ఇష్టంతో కాదనే అభిప్రాయాలున్నాయి. సీఎం ఎప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రులను కలిసినా ఆయన వెంట కాంగ్రెస్ విధేయులైన సీనియ ర్ మంత్రులు, నేతలు ఉండేలా జా గ్రత్తలు తీసుకుంటున్నది.
మొదటి రెండుసార్లు ప్రధానితో రేవంత్ భేటీ అయినప్పుడు డిప్యూటీ సీఎం భట్టి వెళ్లగా, ఇటీవల మూడోసారి మంత్రి శ్రీధర్‌బాబు వెళ్లారు. పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల పై కాంగ్రెస్ విధేయుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నది. ఓవైపు సీఎంగా రేవంత్‌ను నడిపిస్తూనే మరోవైపు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసుకుంటుందనే చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్ పక్కదారి పడితే.. పరిస్థితిని ఎదుర్కొనేందుకు పలువురు సీనియర్ నేతలను సిద్ధం చేసినట్టు తెలిసింది.