హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైరయ్యారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. రాహుల్.. ఎన్నికల ముందు మీరు నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే విద్యార్థులను మీ ప్రజా ప్రభుత్వం కొట్టిందని మీకు తెలుసా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్‌నగర్‌ను సదర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడాలని, వారి ఆవేదను వినాలని, అ‘శోక’ నగరంగా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడాలన్నారు. మీరు వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10 శాతం కూడా భర్తీ చేయలేదని చెప్పారు.
టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు, ఆ సంగతి దేవుడెరుగు.. టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు, కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయిందన్నారు. పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, యువ వికాసం కింద ఇస్తామన్న రూ.5 లక్షల వంటి హామీ ఖాళీ గ్యారంటీగా మారడంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడిందని చెప్పారు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు, మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుందని మండిపడ్డారు.
Telangana’s youth have been misled by @RahulGandhi ji and his party.
Rahul Gandhi ji, are you aware students were beaten by your ‘Prajala Sarkar’ at the very place you visited?
Less than 10% of the promised 2 lakh jobs have been delivered, and the so-called ‘revamped TSPSC’ is… https://t.co/2LSdJ4gBTr pic.twitter.com/qogwk9oh6l
— Harish Rao Thanneeru (@BRSHarish) November 5, 2024