హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): గతంలో అనేకసార్లు హెచ్‌సీయూకి వచ్చి విద్యార్థుల పోరాటాలకు మద్దతు పలికిన రాహుల్‌గాంధీ ఇప్పుడు నోరుమెదపరెందుకని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రశ్నించారు.
విద్యార్థుల పట్ల కరషంగా వ్యవహరిస్తే ఆ విద్యార్థులే ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అందరం విద్యార్థులకు అండగా ఉందామని, వర్సిటీ భూములను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.