హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections) నల్లగొండ(Nallgonda) పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy )భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సైదిరెడ్డి (బీజేపీ)పై రఘువీర్ రెడ్డి గెలుపొందారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. రఘువీర్ రెడ్డి నల్లగొండలో5,59,906 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.
2011లో కడప ఉప ఎన్నికల్లో జగన్ 5.43 లక్ష మెజార్టీతో గెలిచారు. గతంలో జగన్(YS Jagan) సాధించి మెజార్టీ కంటే అధిక మోజార్టీ సాధించినట్లయింది. కాగా, నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన రఘువీర్ రెడ్డికి ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సర్టిఫికెట్ను అందజేశారు.