హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కాపాడాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ కాపాడుతున్నారంటూ నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆరోపించారని గుర్తుచేశారు. అయితే, తమకు ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మాత్రమే తాము కాపాడుతామని చెప్పారు.