కొడిమ్యాల, నవంబర్ 9: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని కొండగట్టు (Kondagattu) జేఎన్టీయూ కళాశాలలో ర్యాగింగ్ (Ragging) కలక లం చోటుచేసుకున్నది. సీనియర్లు ఇద్దరు అబ్బాయిలకు పెండ్లి జరిపించడం, అసభ్యకరంగా నృత్యాలు చేయించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివరాలిలా.. ఈ నెల 6న నాచుపల్లిలోని కొండగట్టు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఫస్టియర్, సీనియర్ విద్యార్థులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
7న ఫ్రెషర్స్ డే వేడుకకు (Freshers Day) సంబంధించి ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత ఇద్దరు అబ్బాయిలకు పెండ్లి జరిపించడం.. ఆకాశంలో చుక్క లు చూపించడం.. అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తూ సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియా, ప లు చానళ్లలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై ఆదివారం విద్యార్థులతో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకుడు జగదీశ్వర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. సరదా కోసమే ఇలా చేశామని.. ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు.