హైదరాబాద్/నాంపల్లి కోర్టులు, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఫోన్ల ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయ న మామ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 25 ఉదయం 10 నుంచి 28 సాయం త్రం 5 గంటల వరకు బెయి ల్ మం జూరు చేస్తున్నట్టు జస్టిస్ కే సుజన మంగళవారం ప్రకటించారు. వర్థంతి కార్యక్రమాలు జరిగే ప్రదేశానికి రాధాకిషన్‌రావును ఎస్కార్ట్‌తో తీసుకెళ్లాలని, కుటుంబసభ్యులను, సమీ ప బంధువులను కలిసేందుకు అనుమతించాలని, మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన వెంటనే ఆయనను మళ్లీ జైలుకు తరలించాలని, అప్పటివరకు ఆయన ఎలాంటి టెలిఫోన్ లేదా మొబైల్‌ఫోన్ వినియోగించకుండా పర్యవేక్షించాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ప్రయాణ ఖర్చులు, ఎసార్ట్ చార్జీలను రాధాకిషన్‌రావే భరించాలని స్పష్టం చేశారు.