నాంపల్లి కోర్టులు, అగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీ గా కొనసాగుతున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు కిడ్నాప్, బెదిరింపుల కేసులో బెయిల్ మంజూరైంది. నాం పల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చే సింది. రూ.10 వేల చొప్పున ఇద్దరి జమానత్‌లను కోర్టుకు సమర్పించాలని, ప్రతి శనివారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని స్పష్టంచేసింది.
రాధాకిషన్‌రావును వారం రోజులపాటు కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కానీ, ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ లభిస్తేనే రాధాకిషన్‌రావు విడుదలయ్యేందుకు వీలుంటుంది.