హైదరాబాద్, జూన్23 (నమస్తే తెలంగాణ): బొగ్గు గనుల వేలాన్ని కేంద్రప్రభుత్వం ఆపాలని, జాతీయ సంపదను కాపాడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమైన పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కృష్ణయ్య ఆదివారం ఓ లేఖ రాశారు. వేలం వేసే గనులను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు జోక్యం చేసుకొని బొగ్గు గనుల వేలం ఆపివేయించాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు.