హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ):పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 20నుంచి 42శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయఅధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతకతో ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీ సంఘం నేతలు చర్చలు జరిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 45శాతం ప్రాతినిధ్యం కల్పించారని, జనరల్ స్థానాల్లో కూడా బీసీ జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీపీ, చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఇస్తుంటే.. ఇకడ ఎన్నికల వాగ్దానం మేరకు రిజర్వేషన్లు పెంచకుండా అన్యాయం చేయడం సరికాదని ఆర్.కృష్ణయ్య వాపోయారు.