హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): జనగణనతోపాటే కులగణన కూడా నిర్వహించాలని, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు డిమాండ్లతో 6, 7వ తేదీల్లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంతో పాటు ఆయా అంశాలపై ఓబీసీ జాతీయ సెమినార్లు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి సెమినార్లకు ఓబీసీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలి పారు. రాజ్యాంగ రచన సమ యంలోనే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిం చకుండా అన్యాయం చేశారని వాపోయారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెరుకుల సుగుణవతిని నియమించినట్టు వెల్లడించారు.