హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు. బీసీ నేతలు, పలువురు ఎంపీలతో కలిసి ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద శనివారం భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ కేం ద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పె ట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓ ట్లు బీసీలవి సీట్లు అగ్రకులాలకా.. జనాభా ప్రకారం వాటా పంచాలంటూ నిలదీశారు. బీసీలకు ఇంకెన్ని రోజులు అన్యాయం చేస్తారని మండిపడ్డారు.
52శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో 14శాతానికి మించలేదంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎ క్కడ ఉన్నదని పేర్కొన్నారు. బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నందా గోపాల్, వీహెచ్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ ఆనంద భాసర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, రాములు నాయక్ పాల్గొన్నారు.