హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్లమెంటు వద్ద బీసీ సంఘాల ఆధర్వంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వెంటనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు టీఆర్ఎస్తో సహా పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న 14 పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని, బీజేపీ అంగీకరిస్తే బిల్లుకు ఆమోదం లభిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని కోరారు.