రవీంద్రభారతి/ఖైరతాబాద్, సెప్టెంబర్ 4 : రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయి రూ. 8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఈ పథకం రద్దు చేయాలనే కుట్రలు మానుకోవాలని, జీవో నంబర్ 9 రద్దు చేసి పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుంటే ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు.
బషీర్బాగ్లో శుక్రవారం కృష్ణయ్య మాట్లాడుతూ.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బడ్జెట్లేదని, అందుకే చెల్లించడంలేదని ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అదేవిధంగా 22ఏ నిబంధన పేరుతో ఆస్తులను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు.