హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని అందజేయనున్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పీవీ సునీత ఎంపికయ్యారు. హైదరాబాద్ జిల్లా నుంచి అందజేసే అవార్డుకు ఆమెను అధికారులు ఎంపికచేశారు. ఐదేండ్లుగా పీవీ సునీత లోక్‌భవన్ పాఠశాలలో టీచర్‌గా సేవలందిస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంగ్లిష్ సబ్జెక్టులో వరుసగా 100% ఉత్తీర్ణత సాధించి ప్రత్యేక గుర్తింపు పొందా రు. సునీతకు ఉ త్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేశారు.