న్యూఢిల్లీ: చివరి దశ మూత్రపిండాల వైఫల్యంతో(కిడ్నీ ఫెయిల్యూర్) బాధపడుతున్న ఒక 66 ఏండ్ల వృద్ధుడికి మానవ మూత్రపిండాన్ని విజయవంతంగా అమర్చే వరకు జన్యుపరంగా మార్పు చేసిన పంది మూత్రపిండంతో రికార్డు స్థాయిలో తొమ్మిది నెలలపాటు డయాలసిస్ లేకుండా కాపాడినట్టు ది లాన్సెట్లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది. బోస్టన్లోని మసాచుసెట్స్ ప్రభుత్వ దవాఖానలో దీన్ని నిర్వహించారు. మూత్రపిండాల చివరి దశ వ్యాధితో బాధపడుతున్న రోగులకు మూత్రపిండ మార్పిడీ ఉత్తమ మనుగడను, జీవన నాణ్యతను అందిస్తుంది.